*మన దునియా ఎడిటర్ సుధాకర్ ను పరామర్శించిన ఐ జె యు నాయకులు*
మన దునియా వరంగల్ మార్చి 12
నల్లబెల్లి ఎస్ హెచ్ ఓ పై చర్యలు తీసుకోవాలి..టి యు డబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు గౌడ్ … వరంగల్: మన దునియా దినపత్రిక ఎడిటర్ ఆకుల సుధాకర్ ను టీయూడబ్ల్యూజే ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడి పెళ్లి మధుగౌడ్, జిల్లా నాయకులు పెరుమాండ్ల మధు , బా దా వ త్ బాలాజీ లు పరామర్శించారు. బుధవారము.. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన దునియా ఎడిటర్ సుధాకర్ ను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఎం జీ ఎం వైద్యులను కోరారు.నల్లబెల్లి ఎస్సై వేధింపుల వల్ల క్రిమి సంహారక మందు తాగి సుధాకర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం పట్ల సుధాకర్ కు నాయకులు మనోధైర్యాన్నిచారు. అనంతరము నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి నల్లబెల్లి ఎస్ ఐపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని,జర్నలిస్టుల పట్ల పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎసిపి తో మధు గౌడ్ కోరారు.