మండలంలోని ఓ గ్రామంలో

పట్టపగలు గుడుంబా తయారీ..

మన దునియా నల్లబెల్లి నిఘా టీం మార్చి 05

నల్లబెల్లి: సంవత్సరం క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెలు ఇప్పుడు గుడుంబా మత్తులో తూగుతున్నాయి. పచ్చని సంసారాల్లో సారా రక్కసి చిచ్చురేపుతోంది, నల్లబెల్లిలో నల్లబెల్లం, పటిక విరివిగా లభిస్తుండడంతో గుడుంబా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ ధరకు దొరుకుతున్న గుడుంబాకు మద్యంప్రియులు అలవాటు పడి అనారోగ్యాల పాలువుతున్నారు. గుడుంబాను అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు అధికారులు నెలవారీ ముడుపులకు ఆశపడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

నల్లబెల్లి మండలంలోని,లె0కాలపల్లి,తదితర గ్రామాల్లో కొందరు గుడుంబా తయారీ, విక్రయాలను కుటీర పరిశ్రమగా మార్చుకుని వారి కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో బెల్టు షాపుల్లో గుడుంబా ఏరులై పారుతోంది. కొందరు స్థానికులతో పాటు గ్రామం అయిన లె0కాలపల్లికి చెందిన కొందరు వ్యక్తులు గుడుంబా తయారీ, హోల్సేల్ విక్రయాన్ని వ్యాపారంగా ఎంచుకుని మండలంలోని లె0కాలపల్లి, తదితర గ్రామాల్లోని బెల్టు షాపుల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తుండటంతో తక్కువ ధరకు లభించే గుడుంబాకు పలువురు బానిసలవుతున్నారు. అప్పుడప్పుడు గ్రామాలకు వచ్చే ఎక్సైజ్ అధికారులు తయారీదారుల నుంచి నెలవారీగా ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నల్లబెల్లం, పటిక డోర్ డెలివరీ..

నల్లబెల్లం, పటిక వ్యాపారాన్ని మండలంలోని కిరాణా షాపుల యజమానులు నిర్వహిస్తున్నారు. అధికారులకు నెల నెలా ముడుపులు చెల్లిస్తూ వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. నల్లబెల్లం, పటికను రాత్రి వేలల్లో ద్విచక్ర వాహనాలపై తయారీదారులకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రానికి చెందిన ఓ కిరాణా షాపు యజమాని కొంత కాలంగా వరంగల్ నుంచి కిరాణం సరుకులతో పాటు బెల్లం, పటికను తీసుకువచ్చి నల్లబెల్లి, లె0కాలపల్లిలో స్టాకు ఉంచి వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

అధికారుల ప్రేక్షక పాత్ర

గుడుంబా తయారీ, విక్రయాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.మండలవ్యాప్తంగా గుడుంబా తయారీ, విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. గుడుంబా తాగి పలువురు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయి.

రెడ్ హ్యాండెడ్ గా పట్టించినా చర్యలు శూన్యం..

గ్రామంలో మద్యం, గుడుంబా విక్రయాలు అధిక కావడంతో మహిళలు, యువకులు కన్నెర్ర చేశారు.గుడుంబా తయారీ, విక్రయాలు చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టించినా వారిపై అబ్కారీ అధికారులు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మద్యం, గుడుంబాపై పోరాటం చేసే వారికి అధికారుల నుంచి ఎలాంటి సహకారమూ లభించలేదు.

గ్రామాల్లో ఏరులై పారుతున్న సారా..

నల్లబెల్లి,లె0కాలపల్లి

నల్లబెల్లం వ్యాపారం

ఎక్సైజ్ పోలీసులు నెలవారీగా ముడుపులు..?

పచ్చని సంసారాల్లో చిచ్చు..

లె0కాలపల్లి ఇంటికి పాల ప్యాకెట్ లాగా గుడుంబా డోర్ డెలివరీ జరుగుతుందిీ….
నెల పెన్షన్ రాగానే తీసుకువచ్చి ఇచ్చే విధంగా విక్రయదారుల దగ్గర పెట్టుకొని వారికి గుడుంబా పోస్తున్నారు.లె0కాలపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *