ఖాకీల్లో కక్కుర్తి…!…

ఖాకీల్లో కక్కుర్తి…! పీఎస్కు వచ్చిన ప్రతీ పంచాయతీకి ఓ రేటు

క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అలాంటి శాఖలో కొందరు సిబ్బంది గాడి తప్పుతున్నారు.

మన దునియా నల్లబెల్లి నిఘా టీం మార్చి 05

నల్లబెల్లి: క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అలాంటి శాఖలో కొందరు సిబ్బంది గాడి తప్పుతున్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సింది పోయి ‘భక్షక’ భటులుగా మారుతున్నారు. దుగ్గొండి సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో మాత్రం సివిల్ సెటిల్మెంట్లు, ఆయా పంచాయతీల సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది. పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రతీ పంచాయతీ సెటిల్మెంట్కు ఓ రేటు తీసుకుంటున్నారు అక్కడి ఇద్దరు కానిస్టేబుల్, కొందరు పోలీసులు ఎంత బాగా పని చేశామన్న దానికంటే.. ఎంత పోగేసుకుందామా అన్నదే ఎజెండాగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

పోలీస్ స్టేషన్కు వస్తే పాపమే అన్న చందంగా తయారయింది పరిస్థితి. విధులను విస్మరించి అక్రమ ఆదాయానికి కక్కుర్తి పడుతున్నారు. శాఖాపరమైన పర్యవేక్షణ కొరవడడం వల్లే పోలీసు శాఖలో అవినీతి సిబ్బంది అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి లంచం ఆశించే అలవాటు ఉన్న కొందరు అధికారులు కింద స్థాయి సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అవినీతి తిమింగలాలు భారీగానే ఉన్నప్పటికీ ఏసీబీకి చిక్కుతున్నది కొందరేనని పదవీ విరమణ పొందిన అధికారులు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు.
ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా ఉండాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించిన ఆ దిశగా ఎవరూ అడుగులు వేయడం లేదు. వచ్చిన ప్రతి పంచాయతీలో కేసు కాకుండా ప్రజా ప్రతినిధులు పంచాయతీ పెట్టి సెటిల్మెంట్ చేస్తుంటే.. దాంట్లో భాగస్వామ్యమై ఖాకీలు లంచం తీసుకుంటున్నారు. కొన్ని పంచాయితీల్లో కేసు నమోదైతే ఇరువర్గాలకు సత్వరం న్యాయం జరగదని ఉద్దేశంతో నాయకులు పంచాయతీ పెట్టి ఎంతో కొంతకు నగదు సెటిల్మెంట్ చేస్తుంటారు. మండల ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *