
మనం దునియా,హైదరాబాద్:జనవరి 26
రిపబ్లిక్ డే సందర్భంగా 2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం సాయంత్రం ప్రకటించింది.
ముగ్గురు విదేశీయులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్, నేపాల్ జానపద గాయ కుడు నరేన్ గురుంగ్‌ను పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం.
గోవాకు చెందిన వంద ఏళ్ల స్వాతంత్ర్య సమరయో ధుడు లిబియా లోబో సర్దేశాయ్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది.
తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ, ఏపీ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, మదుగుల నాగభూషణ్ శర్మ, మిరియాల అప్పారావు పద్మశ్రీకి ఎంపికయ్యారు.