తెలంగాణ బిజెపి అధ్యక్షులు ఈటల రాజేందర్ ?
మన దునియా,హైదరాబాద్:జనవరి 27
తెలంగాణలలో బీజేపీ బీసీ మంత్రాన్నే నమ్ముకుంది. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం కలిసి రాకపోయినా.. ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.
అందులో భాగంగా ఈటెల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యారంట. ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న వారితో పోలిస్తే ఈటల బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట.
అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదంటూ తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈటల నియామకం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్లే అంటున్నారు.
తెలంగాణ కాషాయ రథసారథిగా మల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎంపిక దాదాపు ఖరారైదంట. ఈ నెలాఖరు లోపే దానిపై అధికారిక ప్రకటన, ఈటెల పగ్గాలు చేపట్టడం ఖాయమంటు న్నారు.
పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపు పూర్తవుతున్న క్రమంలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారుపై జాతీయపార్టీ దృష్టి సారిం చింది. ఈటల సారథ్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్దతో ఉన్నారంట?